ఎస్ఆర్, ఎన్ఆర్ హాస్పిటల్స్, సాధన గ్రూప్ ఆధ్వర్యంలో ఘనంగా క్రికెట్ పోటీలు

By Nareshkarri111 , 9 August 2026
విశాఖపట్నం

ఎస్ఆర్, ఎన్ఆర్ హాస్పిటల్స్, సాధన గ్రూప్ ఆధ్వర్యంలో ఘనంగా క్రికెట్ పోటీలు

కలిసి ఆడదాం, కలిసి ఎదుగుదాం

విశాఖపట్నం (పత్రిక ప్రతినిధి): విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ మైదానంలో ఎస్ఆర్ హాస్పిటల్, ఎన్ఆర్ హాస్పిటల్ మరియు సాధన గ్రూప్ సిబ్బంది సంయుక్త ఆధ్వర్యంలో అద్భుతమైన క్రికెట్ మ్యాచ్‌ను అత్యంత వైభవంగా నిర్వహించారు. సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఇ. సత్యానంద్ కుమార్ నాయకత్వంలో, సీఈఓ శ్రీ టి. శ్రీనివాస్ సమన్వయంతో సాగిన ఈ కార్యక్రమం సంస్థల మధ్య ఐక్యతకు, స్నేహబంధానికి ప్రత్యక్ష ప్రతీకగా నిలిచింది. క్రీడల ద్వారా ఉద్యోగుల్లో సమిష్టి కృషి, సమన్వయం మరియు క్రీడాస్ఫూర్తి మరింత బలపడతాయని, సంస్థల సమగ్ర అభివృద్ధికి టీమ్ స్పిరిట్, ఐక్యత ఎంతగానో అవసరమని ఈ సందర్భంగా నిర్వాహకులు వెల్లడించారు. ‘కలిసి ఆడదాం, కలిసి ఎదుగుదాం’ అనే నినాదంతో సాగిన ఈ పోటీలలో ఆయా సంస్థల సిబ్బంది అందరూ ఎంతో ఉత్సాహంతో పాల్గొని కార్యక్రమాన్ని మహోన్నతంగా విజయవంతం చేశారు.

Comments

WhatsApp Share Button