స్త్రీ శక్తి' ఏడాది సంబరాలు: మహిళలకు ఘన సన్మానం,

By Nareshkarri111 , 16 August 2026
గోపాలపట్నం

గోపాలపట్నం (విశాఖపట్నం), PR News Today:** మహిళా సాధికారత, వారి ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'స్త్రీ శక్తి' ఉచిత బస్సు ప్రయాణ పథకం విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా విశాఖ పశ్చిమ నియోజకవర్గం గోపాలపట్నంలోని క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ విప్, శాసనసభ్యులు గణబాబు గారి అధ్యక్షతన ప్రత్యేక సమావేశం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వివిధ రంగాలలో విశేష ప్రతిభ కనబరిచిన పలువురు మహిళలను గణబాబు గారు శాలువాలతో ఘనంగా సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ మహిళా సంక్షేమానికి పెద్దపీట వేసిందని, ఆడవారికి ఆస్తి హక్కు కల్పించడం నుంచి రాజకీయాల్లో 33 శాతం రిజర్వేషన్లు తీసుకురావడం వరకు ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు అమలు చేశామని తెలిపారు. గత ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆడపడుచులకు నిజమైన 'ప్రయాణ స్వాతంత్య్రం' కల్పిస్తూ 'స్త్రీ శక్తి' పథకాన్ని ప్రారంభించారని, నేటికి ఈ పథకం ఏడాది పూర్తి చేసుకోవడం ఎంతో ఆనందదాయకమని అన్నారు. ఇది కేవలం ప్రయాణ ఖర్చులు తగ్గించే పథకం మాత్రమే కాకుండా కుటుంబాలలో ఆప్యాయతలు, అనుబంధాలను పెంచే అద్భుత కార్యక్రమని, గతంలో ప్రయాణ ఖర్చులకు భయపడి పుట్టింటికి, తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లడానికి వెనుకాడిన ఆడపడుచులు నేడు ఉచిత బస్సు ప్రయాణం వల్ల తల్లులు, కూతుళ్లు ఎటువంటి ఆర్థిక భారం లేకుండా తరచూ కలుసుకుంటూ ప్రేమానురాగాలను పంచుకుంటున్నారని పేర్కొంటూ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే  కార్యక్రమంలో భాగంగా జీవీఎంసీ వెస్ట్ జోన్ ఉద్యోగుల సహకారంతో నియోజకవర్గ పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాల చిన్నారుల కోసం సమకూర్చిన లంచ్ ప్లేట్లు, వాటర్ గ్లాసులను పంపిణీ చేసి ఉద్యోగుల సేవాభావాన్ని అభినందించారు. అనంతరం ఎమ్మెల్యే గణబాబు గారు గోపాలపట్నం నుండి కంచరపాలెం వరకు మహిళా ప్రయాణికులతో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణించి, పథకం ద్వారా వారికి కలుగుతున్న ప్రయోజనాలను అడిగి తెలుసుకోగా ప్రయాణికులు తీవ్ర హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ వెస్ట్ జోన్ జోనల్ కమిషనర్ హేమవతి, సింహాచలం డిపో మేనేజర్ హనుమ శ్రీ, CDPO నీలిమ, P4 అధికారులు, ఉద్యోగులు, కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

Comments

WhatsApp Share Button