APUWJ, TGS సంయుక్త ఆధ్వర్యంలో జర్నలిస్టుల కోసం మెగా హెల్త్ క్యాంప్

By Nareshkarri111 , 17 August 2026
విశాఖపట్నం

150 మంది జర్నలిస్టుల కుటుంబాలకు హెల్త్ చెకప్స్.. విశాఖలో విజయవంతమైన మెగా మెడికల్ క్యాంప్

ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ 70వ వార్షికోత్సవం సందర్భంగా విశాఖ అంబేద్కర్ భవన్ లో ఆదివారం ప్రముఖ టెక్నాలజీ సంస్థ టీజీఎస్,  ఏపీయూడబ్ల్యూజె విశాఖ యూనిట్ సంయక్త ఆధ్వర్యంలో వీడెంటల్,వీ హెల్త్ కేర్ పర్యవేక్షణలో ఉచిత మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు. సుమారు 150 మంది జర్నలిస్టులు,జర్నలిస్టులకుటుంబసభ్యులకు ఈ మెడికల్ క్యాంపులో బీపీ,షుగర్, కంటి పరీక్షలు,డెంటల్,పెడియాట్రిక్, గైనికాలాజీ, స్లీప్ తెరపీ,లంగ్స్ తదితర పరీక్షలు వైద్య నిపుణులు నిర్వహించారు. తమకు అన్నివిధాలా సహకరించిన టీజీఎస్ కంపెనీ యాజమాన్యానికి,మెగా  వైద్య శిబిరం ఏర్పాటుచేసిన వీ డెంటర్, వీ హెల్త్ కేర్ ఎండీ రమేష్,వైద్యులకు,సిబ్బందికి ఏపీయూడబ్ల్యూజె రాష్ట్ర ఎలక్ట్రానిక్ మీడియా జనరల్ సెక్రటరీ రామచంద్రరావు కృతజ్ఞతలు తెలిపారు.తమకు,తమ కుటుంబ సభ్యులకు ఉచిత  వైద్య శిబిరం ఏర్పాటుచేసిన ఏపీయూడబ్ల్యూజె విశాఖ యూనిట్ సభ్యులకు ఉచిత సేవలు పొందిన జర్నలిస్టులు ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పలువురు  ఏపీయూడబ్ల్యూజె నాయకులు పాల్గొని సమన్వయం చేసారు.

Comments

WhatsApp Share Button