గోపాలపట్నం PSలో ACP ప్రదీప్తి క్షుణ్ణంగా తనిఖీలు.. అధికారులకు కీలక సూచనలు!

By Nareshkarri111 , 20 August 2026
గోపాలపట్నం

గోపాలపట్నం, ఆగస్టు 20 (PR News Today): వెస్ట్ సబ్ డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ACP) శ్రీమతి పి. ప్రదీప్తి బుధవారం గోపాలపట్నం పోలీస్ స్టేషన్‌లో వార్షిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేషన్‌కు సంబంధించిన పలు కీలక రికార్డులను ఆమె క్షుణ్ణంగా పరిశీలించారు.

వివిధ కేసుల పురోగతిని సమీక్షించిన ACP, విచారణ వేగవంతం చేయడంపై సిబ్బందికి పలు మార్గదర్శకాలు జారీ చేశారు. ముఖ్యంగా పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో బాధ్యతాయుతంగా, మర్యాదపూర్వకంగా మెలిగి వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

Comments

WhatsApp Share Button