జీవీఎంసీ జోన్-8 పరిధిలోని పలు ప్రాంతాల్లో అనుమతులు లేని నిర్మాణాలు ఏదేచ్ఛగా సాగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బిల్డింగ్ ప్లాన్ ఆమోదం పొందని, ఖాళీ స్థలాల పన్ను (VLT) చెల్లించని నిర్మాణాలపై క్షేత్రస్థాయి ప్రణాళికా విభాగం సిబ్బంది తగిన రీతిలో స్పందించడం లేదని తెలుస్తోంది. సాధారణ ప్రజలు నిర్మాణాలు చేపడితే కఠినంగా వ్యవహరించే యంత్రాంగం, నిబంధనలు ఉల్లంఘిస్తున్న కొన్ని ప్రాంతాలలో చూసీచూడనట్లు వ్యవహరించడం వెనుక పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనివల్ల కార్పొరేషన్ రావాల్సిన ఆదాయానికి గండి పడటమే కాకుండా, ప్రణాళికారహిత నిర్మాణాలకు దారితీస్తోంది. అసలు ఏ సచివాలయ పరిధిలో ఈ ఉల్లంఘనలు జరుగుతున్నాయి? ఏ నిర్మాణాలకు ఫీజులు చెల్లించకుండా పనులు కొనసాగిస్తున్నారు? అనే పూర్తి వివరాలు త్వరలోనే ప్రత్యేక కథనం ద్వారా వెల్లడిస్తాం.
Comments