ముదినేపల్లి : ఎన్డీఏ సీనియర్ నాయకులు యర్రా రాంబాబు కుమారుడి వివాహ విందు కార్యక్రమంలో కైకలూరు శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హామీల కమిటీ చైర్మన్ డాక్టర్ కామినేని శ్రీనివాస్ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.
మండలంలోని శింగరాయపాలెం గ్రామంలో గల శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థాన కళ్యాణ మండపంలో బొమ్మినంపాడు గ్రామానికి చెందిన యర్రా రాంబాబు కుమారుడి వివాహ విందు కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపి ఆశీస్సులు అందించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎన్డీఏ కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు మరియు గ్రామస్తులు విశేషంగా పాల్గొన్నారు.
Comments