ఎలమంచిలి ఎమ్మెల్యేకి గల్ఫ్ సేన ప్రతినిధి నర్సింగ్ మరిశా (MNR) జన్మదిన శుభాకాంక్షలు

By D M SATISH KUMAR , 20 August 2026
గాజువాక

ఎలమంచిలి నియోజకవర్గ శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనసేన పార్టీ సీనియర్ నాయకులు మరియు ప్రముఖ రాజకీయ ఉద్దండులకు గాజువాక నియోజకవర్గం 87వ వార్డు వడ్లపూడి ఆర్.హెచ్. కాలనీకి చెందిన సీనియర్ జనసైనికుడు, గల్ఫ్ సేన జనసేన ఎగ్జిక్యూటివ్ మెంబర్ నర్సింగ్ మరిశా (MNR) హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... టీవీ డిబేట్లలో ప్రత్యర్థులకు చెమటలు పట్టించే డేరింగ్ అండ్ డాషింగ్ నాయకుడిగా, రాజకీయ రంగంలో తనదైన శైలితో ముందుకు సాగుతున్న ఎమ్మెల్యే గారు మంచికి మారుపేరుగా నిలుస్తూ ప్రతి ఒక్కరికీ తనవంతు సహాయ సహకారాలు అందిస్తున్నారని కొనియాడారు. తమ్ముడిలా తనను ఎంతో ఆప్యాయంగా పలకరించే ఆయన మంచి మనసుకు కృతజ్ఞతలు తెలుపుతూ, రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రి పదవిని అధిరోహించాలని ఆ శివుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. JSP గ్లోబల్ ఎన్నారై జనసేన టీమ్, యునైటెడ్ కాప్ సొసైటీ (UKS), దుబాయ్ పవనిజం మరియు అబుదాబి జనసేన టీమ్ ప్రతినిధుల తరఫున ఎమ్మెల్యే గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు.

Comments

WhatsApp Share Button