పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో బెల్ట్ షాపులు, అక్రమ మద్యం విక్రయాల నిరోధానికి పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. మీ ప్రాంతంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్నా, లేదా వాటి వల్ల మహిళలు, పిల్లలు ఇబ్బందులు పడుతున్నా వెంటనే పోలీసులకు సమాచారం అందించవచ్చు.సంబంధిత ప్రాంతం పేరు, వివరాలు, లొకేషన్, ఫోటో లేదా వీడియోలను పెందుర్తి ఇన్‌స్పెక్టర్ కె.వి. సతీష్ కుమార్ సెల్ నంబర్ 9440796039 కు వాట్సాప్ ద్వారా పంపగలరు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను 'మీ సమాచారం – మీ గోప్యత – మా బాధ్యత' విధానంలో పూర్తి గోప్యంగా ఉంచి, అక్రమార్కులపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ప్రజల భద్రత, ప్రాంతీయ ప్రశాంతత కోసం పోలీసులకు సహకరించాలని కోరారు.
Comments