By Nareshkarri111 , 26 June 2026

గోపాలపట్నం (prnewstoday): సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం అనువంశిక ధర్మకర్త, బోర్డు చైర్మన్, గోవా రాష్ట్ర గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు జన్మదిన వేడుకలు శుక్రవారం విజయనగరంలోని ఆయన అతిథి గృహంలో ఘనంగా జరిగాయి. సింహాచలం దేవస్థానం ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకట్రావు దంపతులు అశోక్ గజపతిరాజుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు సీతారామాచార్యులు, వేద పండితులు వేదమంత్రోచ్చారణల మధ్య ఆశీర్వచనం అందించి, స్వామివారి ప్రసాదాలను సమర్పించారు.

By Nareshkarri111 , 26 June 2026

గోపాలపట్నం జూన్ 26 : (pr newstoday) తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసే ఓ పాత నేరస్థుడిని గోపాలపట్నం క్రైమ్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. సింహాచలంలోని ప్రియ గార్డెన్స్ అపార్ట్‌మెంట్‌లో కొద్దిరోజుల క్రితం జరిగిన చోరీ మిస్టరీని పోలీసులు వేగంగా చేధించి, మల్కాపురం నివాసి అయిన నూనెల కృష్ణ అనే నిందితుడిని అరెస్ట్ చేశారు. అతని దగ్గరి నుండి పెద్ద ఎత్తున బంగారాన్ని రికవరీ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

By Nareshkarri111 , 25 June 2026

పరవాడ జూన్ 25 : (పిఆర్ న్యూస్ టుడే) పెందుర్తి నియోజకవర్గం, పరవాడ మండలంలోని వాడ చీపురుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని దళాయిపాలెం గ్రామంలో 25 లక్షల రూపాయల ఎన్టీపీసీ (NTPC) సీఎస్‌ఆర్ నిధులతో నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షుడు, పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు మరియు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వన్నెంరెడ్డి సతీష్ కుమార్ ప్రారంభించారు. అదేవిధంగా నాయుడుపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని నాయుడుపాలెం గ్రామంలో 50 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన బీసీ బాలికల హాస్టల్ భవనాలను కూడా వారు ప్రారంభించడం జరిగింది.

By Nareshkarri111 , 25 June 2026

పెందుర్తి, జూన్ 25: యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా కాపాడేందుకు విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా పెందుర్తి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కెవి సతీష్ కుమార్ సూచనల మేరకు సబ్ ఇన్స్పెక్టర్ షేక్ జిలాని నాయుడు తోటలోని భాష్యం స్కూల్ విద్యార్థులకు మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ ఇన్స్పెక్టర్ షేక్ జిలాని మాట్లాడుతూ విద్యార్థి దశ జీవితంలో అత్యంత విలువైన సమయమని, ఈ సమయంలో మంచి అలవాట్లు పెంపొందించుకోవడం ద్వారానే ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవచ్చని తెలిపారు.

By Nareshkarri111 , 25 June 2026
ముఖ్య అతిథిగా హాజరైన పెందుర్తి మాజీ శాసనసభ్యులు, వైఎస్ఆర్సీపీ పెందుర్తి నియోజకవర్గం సమన్వయకర్త అన్నంరెడ్డి అదీప్ రాజ్