By D M SATISH KUMAR , 22 August 2026

మల్కాపురం : మహిళా సాధికారత సాధించినప్పుడే సమాజం, దేశం పురోగమిస్తాయని  పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుడు, ప్రభుత్వ విప్ పి.జి.వి.ఆర్. నాయుడు (గణబాబు) అన్నారు. మల్కాపురంలోని సెయింట్ ఆన్స్ మహిళా డిగ్రీ కళాశాల 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన స్వర్ణోత్సవ వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలనం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 50 ఏళ్లుగా నాణ్యమైన విద్య, సేవాభావం, నైతిక విలువలతో మహిళలను తీర్చిదిద్దుతున్న సెయింట్ ఆన్స్ విద్యాసంస్థల కృషి అభినందనీయమని కొనియాడారు.

By D M SATISH KUMAR , 21 August 2026

పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో బెల్ట్ షాపులు, అక్రమ మద్యం విక్రయాల నిరోధానికి పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. మీ ప్రాంతంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్నా, లేదా వాటి వల్ల మహిళలు, పిల్లలు ఇబ్బందులు పడుతున్నా వెంటనే పోలీసులకు సమాచారం అందించవచ్చు.సంబంధిత ప్రాంతం పేరు, వివరాలు, లొకేషన్, ఫోటో లేదా వీడియోలను పెందుర్తి ఇన్‌స్పెక్టర్ కె.వి. సతీష్ కుమార్ సెల్ నంబర్ 9440796039 కు వాట్సాప్ ద్వారా పంపగలరు.

By D M SATISH KUMAR , 20 August 2026

ఎలమంచిలి నియోజకవర్గ శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనసేన పార్టీ సీనియర్ నాయకులు మరియు ప్రముఖ రాజకీయ ఉద్దండులకు గాజువాక నియోజకవర్గం 87వ వార్డు వడ్లపూడి ఆర్.హెచ్. కాలనీకి చెందిన సీనియర్ జనసైనికుడు, గల్ఫ్ సేన జనసేన ఎగ్జిక్యూటివ్ మెంబర్ నర్సింగ్ మరిశా (MNR) హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...

By D M SATISH KUMAR , 20 August 2026

ముదినేపల్లి : ఎన్డీఏ సీనియర్ నాయకులు యర్రా రాంబాబు కుమారుడి వివాహ విందు కార్యక్రమంలో కైకలూరు శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హామీల కమిటీ చైర్మన్ డాక్టర్ కామినేని శ్రీనివాస్ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.

By D M SATISH KUMAR , 20 August 2026

కమర్షియల్ సోలార్ వినియోగదారులపై టీఓడీ (టైం అఫ్ డే) టారిఫ్ విధానాన్ని వర్తింపజేయడం వల్ల వారు ఆర్థికంగా నష్టపోతున్నారని ఆంధ్ర ప్రదేశ్ సోలార్ ఇంటెగ్రేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బి విశ్వప్రసాద్ తెలిపారు. గురువారం మీడియాతో ఆయన మాట్లాడుతూ ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు సోలార్ ప్యానెల్స్ ద్వారా విద్యుత్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుందని , సాయంత్రం 6 నుండి రాత్రి 10 గంటల వరకు (పీక్ హవర్స్ ) సోలార్ ఉత్పత్తి ఉండదన్నారు. వ్యాపారులు  ఈ సమయంలో గ్రిడ్ విద్యుత్‌ను వాడాల్సి వస్తుందని, దీనికి ప్రభుత్వం భారీగా టీఓడీ ఛార్జీలు వసూలు చేస్తోందన్నారు.

By D M SATISH KUMAR , 20 August 2026

గాజువాక. వరలక్ష్మీ వ్రతం పండుగ సందర్భంగా ఆలయాలు, మార్కెట్లలో రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో దొంగతనాలు, చైన్ స్నాచింగ్‌లను అరికట్టేందుకు విశాఖ సౌత్ సబ్ డివిజన్ క్రైమ్ పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. పండుగ పూట ప్రజల భద్రతే లక్ష్యంగా గాజువాక పరిధిలోని ప్రధాన రహదారులు, రద్దీ కూడళ్లలో క్రైమ్ ఇన్‌స్పెక్టర్ జి.డి.

By D M SATISH KUMAR , 20 August 2026

సురక్షితంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చిన పెందుర్తి పోలీసులు

ఫోన్ విషయంలో తల్లిదండ్రులు మందలించారని ఇల్లు వదిలి వెళ్లిపోయిన ఓ ఇంటర్మీడియట్ మైనర్ బాలుడిని పెందుర్తి పోలీసులు సురక్షితంగా రక్షించి, తల్లిదండ్రులకు అప్పగించారు.