జీవీఎంసీ జోన్-8 పరిధిలోని పలు ప్రాంతాల్లో అనుమతులు లేని నిర్మాణాలు ఏదేచ్ఛగా సాగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బిల్డింగ్ ప్లాన్ ఆమోదం పొందని, ఖాళీ స్థలాల పన్ను (VLT) చెల్లించని నిర్మాణాలపై క్షేత్రస్థాయి ప్రణాళికా విభాగం సిబ్బంది తగిన రీతిలో స్పందించడం లేదని తెలుస్తోంది. సాధారణ ప్రజలు నిర్మాణాలు చేపడితే కఠినంగా వ్యవహరించే యంత్రాంగం, నిబంధనలు ఉల్లంఘిస్తున్న కొన్ని ప్రాంతాలలో చూసీచూడనట్లు వ్యవహరించడం వెనుక పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనివల్ల కార్పొరేషన్ రావాల్సిన ఆదాయానికి గండి పడటమే కాకుండా, ప్రణాళికారహిత నిర్మాణాలకు దారితీస్తోంది.



గోపాలపట్నం (విశాఖపట్నం), PR News Today:** మహిళా సాధికారత, వారి ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'స్త్రీ శక్తి' ఉచిత బస్సు ప్రయాణ పథకం విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా విశాఖ పశ్చిమ నియోజకవర్గం గోపాలపట్నంలోని క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ విప్, శాసనసభ్యులు గణబాబు గారి అధ్యక్షతన ప్రత్యేక సమావేశం ఘనంగా జరిగింది.